కోలీవుడ్ సూపర్‌స్టార్ అజిత్‌కు స్పోర్ట్స్ బైక్స్ అన్నా, స్పోర్ట్స్ కార్స్ అన్నా విపరీతమైన మోజు. అనేక రేసుల్లో అతను స్వయంగా పాల్గొన్నాడు కూడా. తన సినిమాల్లో సొంత బైకులతో డూప్ లేకుండా అతను పలు సీన్లు చేశాడు. ఒకసారి ఆర్థిక ఇబ్బందుల వల్ల తన బుల్లెట్ బైక్‌ను అమ్మాల్సి వచ్చిందనే విషయం మీకు తెలుసా? ఎ.ఆర్. మురుగదాస్ డైరెక్ట్ చేసిన 'దీన' (2001) సినిమా అజిత్ కెరీర్‌కు గేమ్ చేంజర్ అయ్యింది. ఆ సినిమాతోటే ఫ్యాన్స్ ఆయనకు 'తల' అనే టైటిల్ ఇచ్చారు. నిజానికి, ఈ యాక్షన్ ఫిల్మ్‌లో అతను తన సొంత బుల్లెట్ బైక్‌ను ఉపయోగించాడు.
'దీన' మూవీలో అజిత్ అనుచరుల్లో ఒకడిగా నటించిన సంపత్ రావు ఆ బైక్ స్టోరీ గురించి చెప్తూ, ఇంటి అద్దెను కూడా కట్టలేని పరిస్థితులను అజిత్ ఎదుర్కొన్నాడనీ, అప్పుడు తన బైక్‌ను అమ్మాల్సి వచ్చిందనీ వెల్లడించాడు. అంటే ఒకప్పుడు ఆర్థికంగా అజిత్ అంతటి క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడన్న మాట. అలాంటి స్థితి నుంచి ఇవాళ దేశంలోని అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్స్‌లో ఒకడనే స్థాయికి అతను ఎదిగాడు.
వృత్తిపరమైన విషయానికొస్తే, అజిత్ ప్రస్తుతం 'వాలిమై' మూవీ చేస్తున్నాడు. ఇందులో తెలుగు యాక్టర్ కార్తికేయ విలన్‌గా నటిస్తుండగా, హుమా కురేషి నాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో పలు బైక్ చేజింగ్ సీన్లను అజిత్ చేస్తున్నాడు. 'నేర్కొండ పార్వై' ('పింక్' రీమేక్) తర్వాత అజిత్, నిర్మాత బోనీ కపూర్, దర్శకుడు హెచ్. వినోద్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది.